ఎమ్మెల్యేగా గెలిచి స్థానికులకు అందుబాటులో లేని ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు సుర దేవరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ప్ల కార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు మాట్లాడుతూ.. సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచి స్థానికుల సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే కేటీఆర్ తన పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ వేధింపులు భరించలేక ఓ నేత కార్మికుడు మూడు రోజులుగా అదృశ్యమై, నిన్నటి రోజున శవమై కనిపించాడని ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆత్మహత్య అంశంలో ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ సిరిసిల్ల ప్రజల సమస్యలు పట్టించుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిరిసిల్ల ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల కొరకు, వారి బాగోగులు గురించి అధికారులతో ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ పెట్టావా అంటూ ప్రశ్నించారు. సిరిసిల్ల అభివృద్ధి కోసం ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంను కలిసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా.. మీకు అభివృద్ధి అవసరం లేదు ప్రజా సమస్యలు అవసరం లేదు, మరి అలాంటప్పుడు సిరిసిల్ల ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే పదవి ఎందుకు..? అని ప్రశ్నించారు. గత మీ ప్రభుత్వంలో మా పద్మశాలి బిడ్డలకు బతుకమ్మ చీరల చెల్లింపులు బకాయిలు పెట్టి పోతే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బకాయలు చెల్లించి వారిని ఆదుకున్నామని తెలిపారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో వారంలో రెండు రోజులు ఇక్కడే ఉంటా.. ప్రజల సమస్యలు పరిష్కరిస్తా.. అని చెప్పిన కేటీఆర్, వారానికి రెండు రోజులు ఏమోగానీ ఆరు నెలలకు రెండు రోజులు కూడా ఇక్కడ ఉండడం లేదని, కేటీఆర్ పేరుతో ఉన్న ప్ల కార్డులతో నిరసన తెలియజేశారు. ఇటీవల జరిగిన సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో 39 వార్డులలో పర్యటించి కేటీఆర్ అనే నన్ను చూసి బిఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరిన కేటీఆర్, గెలిచిన అనంతరం వార్డుల సమస్యలు ఏమి ఉన్నాయో తెలుసుకున్నావా..? అని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి రియాజ్, కౌన్సిలర్లు కూరపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు, బొద్దుల శ్రీనివాసు, జిల్లా నాయకులు మంగ కిరణ్, మాాజీ కౌన్సిలర్ రాగుల జగన్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పోగుల దేవరాజు, చిందం శ్రీనివాస్, దుబల వెంకటేశం, స్వర్గం రాజు, కోడం అరుణ, బైరి ప్రభాకర్, వంతడుపుల రాము, కంసాల మల్లేశం, రాగుల రాములు, దేవదాసు, శ్రీగద మైసయ్య, పిట్టల శ్రీకాంత్, నక్క నరసయ్య, సలంద్రి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కేటీఆర్ కనిపించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన
byJanavisiontv
-
0