సిరిసిల్ల కి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు: రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు
సిరిసిల్ల కి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయా చైర్మన్ నాగుల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 కోట్లతో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిరిసిల్ల కి మంజూరు అయినట్లు విప్ ఒక ప్రకటనలో తెలిపారు...
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు డిజిటల్ తరగతి గదులు, ఆధునిక సైన్స్ ల్యాబొరేటరీలు, గ్రంథాలయాలు, కంప్యూటర్ సదుపాయాలు, క్రీడా వసతులు వంటి మౌలిక సదుపాయాలను కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. చదువుతో పాటు విద్యార్థులలో సృజనాత్మకత, నైపుణ్యాలు, క్రీడా ప్రతిభను పెంపొందించేలా విద్యా విధానాన్ని రూపొందిస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించడమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లక్ష్యం..ఈ పాఠశాలల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు సమానమైన విద్యా అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా పాఠశాలల్లో మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన చేపట్టారు..
200 కోట్లతో సిరిసిల్ల కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి లు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.