కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగిస్తుంది: సూర దేవరాజు, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు

కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగిస్తుంది:

సూర దేవరాజు, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు


రాజన్న సిరిసిల్ల జిల్ల, 18 ఆగస్టు 2026: ప్రతి అంశాన్ని రాజకీయంతో ముడి పెట్టడం టిఆర్ఎస్ పార్టీకి అలవాటుగా మారిందని అన్నారు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు. సిరిసిల్ల ఆర్డిఓ ఆఫీస్ వద్ద BRS ధర్నాను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు చీకొడుతున్నా వారికి బుద్ధి రావడం లేదని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తీసిన జీవోలకు చట్టబద్ధత లేదని కోర్టు తెలియజేసిందని ఈ సందర్భంగా తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. ఏ పరిస్థితిలోనూ వాటిని రద్దు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని తెలిపారు.
 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ సంబంధించిన జీవోలపై హైకోర్టు ఈనెల 12 న మధ్యంతర స్టే విధించగా సెప్టెంబర్ 9 వరకు వేచి చూడకుండా స్టేను తొలగించేందుకు డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తెలియజేశారని చెప్పారు.

ఈ కుట్ర వెనుక బిఆర్ఎస్ పాత్ర ఉందని అనుమానాలు కూడా మాకు వ్యక్తం అవుతున్నాయని సందేహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని బద్నం చేయడం బిఆర్ఎస్ పార్టీ కుట్రలో భాగమని అన్నారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలు ఆపుతామని ఎక్కడ చెప్పలేదని తెలిపారు. ప్రభుత్వాన్ని బద్నం చేయడానికి కేటీఆర్ చేస్తున్న కుట్రలో భాగమని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. యధావిధిగా పథకాలు కొనసాగుతాయని, బిఆర్ఎస్ మాయలో పడవద్దని, ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలను కోరుతున్నానని అన్నారు.

 కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల జగన్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, కౌన్సిలర్లు లింగంపల్లి గంగరాజు, కూరపాటి శ్రీశైలం, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షులు నక్క నరసయ్య, కుడికల రవికుమార్, నాయకులు బొప్ప దేవయ్య, బైరి ప్రభాకర్, కంసాల మల్లేశం, ఇప్పపుల లక్ష్మణ్, ఆడెపు ప్రసాదు, పరశురాములు, సదుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post