సిరిసిల్ల బస్ డిపో మేనేజర్ గా జి.భరత్ కుమార్ బాధ్యతల స్వీకరణ
సిరిసిల్ల 17 సెప్టెంబర్ 2026: సిరిసిల్ల డిపో నూతన మేనేజర్ జి.భరత్ కుమార్ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎ. ప్రకాశ రావు మహేశ్వరం డిపోకు బదిలీ కాగా ఆయన స్థానంలో బస్ భవన్ (హెడ్ ఆఫీస్) నుండి జి.భరత్ కుమార్ నియమితులయ్యారు. బాధ్యతల స్వీకరణ అనంతరం డిపో అధికారులు సిబ్బంది నూతన మేనేజరు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ జి.భరత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన ప్రజా రవాణా సేవలను అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. డిపో పరిధిలో బస్సుల నిర్వహణ, సమయపాలన, ప్రయాణికుల సౌకర్యాలు, సిబ్బంది సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. డిపో పనితీరును మరింత మెరుగుపరిచేందుకు సిబ్బంది సహకారం ఎంతో అవసరమని, ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చే సూచనలు, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని సేవల్లో మరింత నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ జి ప్రకాష్ రెడ్డి, ఏడిసిలు లకావత్ రాంరెడ్డి, పద్మ, మోహన్, కార్యాలయ సిబ్బంది సూపర్డెంట్ నరహరి సార్ , సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ , కండక్టర్లు,డ్రైవర్లు, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు.