నిఘా నీడలో గణేష్ శోభాయాత్ర.. కొనసాగుతున్న నిమజ్జనాలు



నిఘా నీడలో గణేష్ శోభాయాత్ర.. కొనసాగుతున్న నిమజ్జనాలు


రాజన్నసిరిసిల్ల, 25 సెప్టెంబర్ 2026 : సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగుతున్న గణేష్ శోభాయాత్రను జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ పర్యవేక్షిస్తున్నారు.

పట్టణంలోని ప్రధాన కూడళ్లు, నిమజ్జన ప్రదేశాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్రను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

ట్రాఫిక్ సమస్యలు, ఇతర ఇబ్బందులు తలెత్తిన వెంటనే వైర్‌లెస్‌ ద్వారా సంబంధిత సిబ్బందికి సూచనలు చేస్తూ తక్షణ చర్యలు చేపడుతున్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 


శోభాయాత్రకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం కొనసాగేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post