పోషకాహారంపై తల్లులకు అవగాహన కార్యక్రమం

పోషకాహారంపై తల్లులకు అవగాహన కార్యక్రమం


సిరిసిల్ల, 23 సెప్టెంబర్ 2026: సిరిసిల్ల పట్టణంలోని 30వ వార్డు చర్చి ఏరియా అంగన్‌వాడీ కేంద్రంలో  ''పోషక మాసం'' సందర్భంగా తల్లులకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమం" నిర్వహించారు. ఐ, సి,డి,ఎస్, సూపర్‌వైజర్ ఎం. స్నేహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గర్భిణీలు, బాలింతల సమక్షంలో 6 నెలలు నిండిన చిన్న పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం చేశారు.
ఈ సందర్భంగా సూపర్‌వైజర్ స్నేహ మాట్లాడుతూ..  అంగన్‌వాడీ కేంద్రం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు 3 సంవత్సరాల లోపు పిల్లలకు పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలలో మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యతను తల్లులకు వివరించారు.
అనంతరం కౌన్సిలర్ మంచె రేణుక  మాట్లాడుతూ గర్భిణీలు, పిల్లలు పోషకాహార లోపాలు రాకుండా చూసుకోవాలని, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వం అంగన్‌వాడీల ద్వారా అందిస్తున్న అన్ని సేవలను తల్లులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ ఎస్. శారద, ఆర్.పి.ఆస్గా, ఎ.ఎన్.ఎం రేణుక, ఆశా కార్యకర్త పుష్ప, అధ్యక్షురాలు కవితతో పాటు తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.

రిపోర్టర్: ఆడెపు లక్ష్మణ్ 
సిరిసిల్ల 

Post a Comment

Previous Post Next Post