సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సినారె జయంతి వేడుకలు

తెలుగు సాహిత్య శిఖరాలను అధిరోహించిన మహాకవి సినారె
సినారే కవిత్వం భావజాలానికి ప్రతిబింబం

రాజన్నసిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఎలగొండ రవి, ఆడెపులక్ష్మణ్

రాజన్న సిరిసిల్ల, జూలై 29: తెలుగు సాహిత్యాన్ని, చలనచిత్ర రంగాన్ని, తన అమృతమయమైన కవిత్వంతో, గజళ్లతో, వేలాది భావోద్వేగభరిత సినీ గీతాలతో విశిష్ట శిఖరాలకు తీసుకెళ్లిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణరెడ్డి అని అన్నారు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఎలగొండ రవి, మానేరు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్. బుధవారం సిరిసిల్లలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా హన్మాజీపేట గ్రామంలో 1931 జూలై 29న జన్మించిన సినారె తెలుగు సాహిత్య రంగంలో చిరస్థాయిగా నిలిచిన మహాకవి, అనేక కావ్య గ్రంథాలను రచించినప్పటికీ విశ్వంభర కావ్య సంపుటితో ఆయన జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారని తెలిపారు. ఆ మహాకవి మన జిల్లా వాసి కావడం గర్వకారణమని చెప్పారు. ఆయన ఉస్మానియావిశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా, ఉపకులపతిగా సేవలందించడమే కాకుండా రాజ్యసభ సభ్యుడిగా కూడా విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. డా. సి. నారాయణరెడ్డి తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడని, ఆయన రచనలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. సినారె కవిత్వం భావజాలానికి ప్రతిబింబం. ఆయన సినీ గీతాలు తెలుగు భాష సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి అని తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు మైలారం తిరుపతి, ఉపాధ్యాయుుని, ఉపాధ్యాయులు రాజలింగం, సతీష్ బాబు, జయంతి, అర్చన, వైదేహి, కే.మంజుల, రేణుక, స్వప్న, వసంత, రమణాదేవి, విమోచన, టీ. మంజుల తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post