సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
రాజన్నసిరిసిల్ల, 15 ఆగస్టు 2025:
79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్ జాతీయ జెండాను ఎగురవేసారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా.. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి తమ జీవితాలను త్యాగం చేసిన స్వాతంత్ర పోరాట యోధులను స్మరిస్తూ అధ్యక్షుడు జయంత్ మాట్లాడారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ పాలకవర్గ సభ్యులు కంకణాల శ్రీనివాస్, వంకాయల శ్రీకాంత్, ప్రయాకర్ రావు వేణు, చౌటపల్లి వెంకటేష్, దుమాల రాము, జంగిలి రాజు తో పాటు సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం, ఊరడి మల్లికార్జున్, టివి నారాయణ, రాచ లక్ష్మణ్, రాపల్లి సంతోష్, మేడి కిషన్, కాంభోజ ముత్యం, చింతకింది శ్యామ్ ఆంధ్రజ్యోతి, పాలమాకుల శేఖర్ సాక్షి టౌన్, మిట్టపల్లి కాశీనాథ్, ప్రసాద్ రెడ్డి టి న్యూస్, నగేష్ నమస్తే తెలంగాణ కలెక్టరేట్, జాన దయానంద్ మెట్రో న్యూస్, నీరటి నవీన్ దిశ, పరకాల ప్రవీణ్ నమస్తే తెలంగాణ టౌన్, గంగు సతీష్ 99టివి, అన్సర్ అలీ, నాయిని బాబు ఈనాడు టౌన్, రచ్చ మధు సూర్య, శ్రీనివాస్ సూర్య టౌన్, మహిళా పాత్రికేయురాలు శిరీష ఆంధ్రప్రభ టౌన్, రఘు ఎన్టీవీ తదితరులు పాల్గొన్నారు.