టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా మేకల కమలాకర్ నియామకం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా మేకల కమలాకర్ ను నియమిస్తూ ఆ పార్టీ నాయకత్వం ఉత్తర్వులు వెలువరించింది. దశాబ్ద కాలం పైగా ఎస్సీల సంక్షేమం కోసం సంఘాన్ని ఏర్పాటు చేసి, సామాజిక కార్యక్రమాలు చేస్తున్న మేకల కమలాకర్ కృషిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్లో కార్యదర్శిగా నియమించడం పట్ల సిరిసిల్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. తను నియామకానికి సహకరించిన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తో పాటు ఎస్సి డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణకు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ లకు ఈ సందర్భంగా మేకల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి టిపిసిసి ఎస్సి సెల్ రాష్ట్ర కార్యదర్శిగా తనపై బాధ్యత మరింత పెరిగిందని కమలాకర్ అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతష్టత కోసం, ఎస్సీల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.