పెండింగ్ లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల సమస్యను పరిష్కరించాలి: టీయూడబ్ల్యూజే హెచ్-143 జిల్లా అధ్యక్షులు లాయక్ పాష

పెండింగ్ లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల సమస్యను పరిష్కరించాలి: టీయూడబ్ల్యూజే హెచ్-143 జిల్లా అధ్యక్షులు లాయక్ పాష
రాజన్న సిరిసిల్ల జిల్ల, 18 ఆగస్టు 2026: జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం, స్వేచ్ఛ పరిరక్షణ కోసం టీయూడబ్ల్యూజే హెచ్-143 నిరంతరం పోరాడుతుందని అన్నారు జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా. అల్లం నారాయణ, మారుతి సాగర్‌ల సారథ్యంలో సిరిసిల్ల పట్టణంలో మంగళవారం నిర్వహించిన యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లాయక్ పాష మాట్లాడుతూ.. జర్నలిస్టులకు నివేశన స్థలాలు, హెల్త్ కార్డులు కల్పించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ కారణాల చేత అసువులు బాసిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం, పెన్షన్ అందించే కార్యక్రమంలో సంఘం ముందుండి పనిచేస్తుందని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ టీయూడబ్ల్యూజే హెచ్-143 అధ్యక్షుడిగా పరకాల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా రఘువీర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను జిల్లా కమిటీ, సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. యూనియన్ బలోపేతంతో పాటు సభ్యుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలను ఐక్యంగా పరిష్కరించేందుకు ముందుండి పనిచేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్ కుమార్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సామల గట్టు, కోశాధికారి సయ్యద్ ఖలీమ్‌, ఉపాధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి సల్మాన్, మల్లికార్జున్, దారం కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కంటాల విజయ్, మాజీ పట్టణ అధ్యక్షుడు రామనాధం, సీనియర్ పాత్రికేయులు చిలుక సత్యనారాయణ, నాగరాజు, బి.శ్రీనివాస్, ఎం. శ్రీనివాస్, భాస్కర్, రఫీ, అస్లాం లతో పాటు జిల్లా నాయకులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post