సిరిసిల్ల వార్డు సందర్శన లో పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు


రాబోయే ఎన్నికల్లో స్థానిక నాయకుడినే ఎమ్మెల్యే గా గెలిపించుకోవాలి

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు ధ్వజం
రాజన్నసిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికలు రాగానే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు వార్డులు గుర్తుకొస్తున్నాయా..? అని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూర దేవరాజు ప్రశ్నించారు. శుక్రవారం పట్టణంలోని 29, 30, 32 వార్డులలో నిర్వహించిన వార్డు కమిటీల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా సూర దేవరాజు మాట్లాడుతూ... గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వారంలో రెండు రోజులు సిరిసిల్లలోనే ఉండి ప్రజల సమస్యలు తీరుస్తాను అని కేటీఆర్ ఇచ్చిన హామీని ఇప్పుడు విస్మరించారని మండిపడ్డారు.

సిరిసిల్ల పట్టణంలో దాదాపు లక్ష ఓట్లు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో మన సమస్యలు తెలిసిన స్థానిక నాయకుడినే ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని కోరారు. శాసనసభ్యుడిగా గెలిచి హైదరాబాద్‌లో నివాసముండే నాయకుడు మనకు అవసరమా? ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి?" అని ప్రశ్నించిన ఆయన, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలపై తక్షణమే స్పందించే వ్యక్తికి రాబోయే ఎన్నికల్లో ఓటేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కూరపాటి శ్రీశైలం,
బూట్ల నవీన్, భీమవరం శ్రీనివాస్, దుంపేటి రాకేష్, బచ్చు ప్రసాద్, గజ్జెల అశోక్, గుడిసేటి బాలరాజు, సదుల గంగరాజు, మోర ప్రసాద్, కైరంకొండ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post