ఇంచార్జి డీపీఆర్ఓ గా శ్రీనివాసాచారి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి డీపీఆర్ఓ గా శ్రీనివాసాచారి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారిగా వ్యవహరిస్తున్న శ్రీనివాసాచారి ఇంచార్జి డీపీఆర్ఓగా బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. జర్నలిస్టులకు అందుబాటులో ఉండి.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను చేరవేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులు, అధికారులను సమన్వయంతో పని చేస్తూ ముందుకు వెళ్తానని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేస్తామని, త్వరితగతిన కార్డులు జారీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇంచార్జి డీపీఆర్ఓ స్పష్టం చేశారు.