మేడిగడ్డ బ్యారేజీ నాణ్యత ప్రమాణాలపై సీబీఐ విచారణ చేపట్టాలి: సిరిసిల్లలో కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్


సిరిసిల్ల, 25 అక్టోబర్ (మెట్రో న్యూస్): మేడిగడ్డ బ్యారేజీ నాణ్యత ప్రమాణాలపై సీబీఐ చే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి. బుధవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. బ్యారేజీ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్లు ఏర్పడ్డాయని అన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్ ఆర్ ఎస్ పి, ఎల్ ఎం డి, కడెం ప్రాజెక్టుల నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలతో నిర్మించడం వలన ఇప్పటికీ చెక్కుచెదరలేదని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం తోనే ఇలాంటి ఘటనలు చేసుకుంటూ ఉన్నాయని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పథకాలన్నీ కమిషన్ల కోసమే ప్రవేశపెట్టారని ఆరోపించారు. సిరిసిల్ల మానేరు వాగు పై నిర్మించిన చెక్ డ్యాములు నాణ్యత లోపాలతో ధ్వంసమై పలువురి మరణాలకు కారణమయ్యాయని అన్నారు. బిఆర్ఎస్, బిజెపి రెండు ఒకటేనని వీటివల్ల భవిష్యత్ తరాలు బంది అవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం ఆసన్నమైందని అన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, నాయకులు వైద్య శివప్రసాద్, గోలి వెంకటరమణ, అన్నల్ దాస్ భాను తదితరులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post