కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ కమిటీ విస్తరణ


(రాజన్న సిరిసిల్ల జిల్ల, 25 అక్టోబర్ (జన విజన్ న్యూస్):
 కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ ప్రధాన కార్యదర్శితో పాటు మీడియా అండ్ ఆఫీస్ ఇన్చార్జిగా మ్యాన ప్రసాద్ ను నియమిస్తూ కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ కమిటీ ని విస్తరించారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చౌటుపల్లి వేణుగోపాల్, పట్టణ ఉపాద్యక్షునిగా  అన్నల్దాస్ భాను లను నియమిస్తూ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. తమ నియామకానికి సహకరించిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి లకు మ్యాన ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా చేనేత అధ్యక్షులు గోనె ఎల్లప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్య శివప్రసాద్, జిల్లా నాయకులు గోలి వెంకటరమణ, కాముని నలినికాంత్, తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జె టోనీ తదితరులున్నారు.

Post a Comment

Previous Post Next Post