నేడు దిల్లీలో భాజపా అగ్రనేతలతో పవన్‌ భేటీ..

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బుధవారం స్పష్టత వస్తుందని భాజపా కీలక నేత ఒకరు తెలిపారు. బుధవారం దిల్లీలో భాజపా అగ్రనేతలతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సమావేశం కానున్నారు..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కూడా ఈ చర్చల్లో పాల్గొంటారని సమాచారం. ఇందులో జీహెచ్‌ఎంసీ సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వస్తుందని పేర్కొంటున్నారు. 

జనసేన నేతలు ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని భాజపా నేతలు ఇప్పటికే వ్యక్తపరిచారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు ఇటీవల పవన్‌కల్యాణ్‌ను కలసి ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై చర్చించిన విషయం విదితమే.

Post a Comment

Previous Post Next Post