డిసెంబర్ 29, 30 తేదీలలో గోవాకు ఆర్టీసీ ప్రత్యేక బస్
రాజన్న సిరిసిల్ల జిల్ల
జిల్లా కేంద్రం రాజన్న సిరిసిల్ల నుండి మురుడేశ్వర్, గోకర్ణ, గోవా వంటి ప్రదేశాలకు రెండు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ఏర్పాటు చేసినట్లు సిరిసిల్ల ఆర్టీసి డిపో మేనేజర్ ప్రకాశరావు ఒక ప్రకటనలో తెలిపారు.
మొదటి టూర్ ప్యాకేజ్
మురుడేశ్వర్, గోకర్ణ, గోవా టూర్ కై ఈనెల 29న మధ్యాహ్నం 12 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి మురుడేశ్వర్, గోకర్ణ దేవాలయాల దర్శనం అనంతరం 31 నాడు గోవాకు చేరుకుంటుందని వివరించారు. అక్కడి నుండి బస్సు జనవరి 1న బయలుదేరి జనవరి 2న సిరిసిల్లకు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ. 4000, పిల్లలకు 2800 చార్జీలుగా నిర్ణయించినట్లు తెలిపారు.
రెండవ టూర్ ప్యాకేజ్..
గోవా టూర్ ప్యాకేజీ లో భాగంగా ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి డీలక్స్ బస్సు బయలుదేరి 31 నాడు గోవాకు చేరుకుంటుందన్నారు. అక్కడినుండి బస్సు తిరిగి జనవరి 2న బయలుదేరి జనవరి 3న సిరిసిల్లకు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ. 3600 పిల్లలకు రూ. 2600 చార్జీలుగా నిర్ణయించినట్లు తెలిపారు. టిఫిన్, భోజనం, వసతి మరియు దర్శనం టికెట్లు యాత్రికులే భరించాలన్నారు ఆసక్తిగల ప్రయాణికులు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవడానికి, మరిన్ని వివరాలకై సెల్ నెంబర్
9063403778, 9959225929, 6304171291, 9154298576 లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు