రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ పోలింగ్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి ఫేజ్ పోలింగ్ శాతం 78.58

జిల్లాలో మొదటి ఫేజ్ పోలింగ్ శాతం 79.57

మొత్తం 1,11,148 ఓట్లలో పోలైన ఓట్లు 88,442

----------------------------------------------
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ - 11
----------------------------------------------

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికల పోలింగ్ 79.57 శాతం నమోదు అయింది. చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాల్లో గురువారం పోలింగ్ నిర్వహించారు. ఐదు మండలాల్లో కలిపి మొత్తం 1,11,148 ఓట్లు ఉండగా, 88,442 పోల్ అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 79.57 శాతం పోలింగ్ నమోదు అయింది.


మండలాల వారిగా ఓటర్లు.. నమోదు అయిన పోలింగ్ శాతం..

వేములవాడ రూరల్ మండలంలో మొత్తం ఓటర్లు 18,825 మంది ఉండగా, 15,525మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 82.47 శాతం నమోదు అయింది.

కోనరావుపేట మండలంలో మొత్తం ఓటర్లు 34,641 మంది ఉండగా, 28,420 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 82.04 శాతం నమోదు అయింది.

చందుర్తి మండలంలో మొత్తం ఓటర్లు 28,094 మంది ఉండగా, 21,823 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.68శాతం నమోదు అయింది.

వేములవాడ అర్బన్ మండలంలో మొత్తం ఓటర్లు 18,492మంది ఉండగా, 14,687 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 79.42 శాతం నమోదు అయింది.

రుద్రంగి మండలంలో మొత్తం ఓటర్లు 11,096 మంది ఉండగా, 7,987 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 71.98 శాతం నమోదు అయింది.

Post a Comment

Previous Post Next Post