జనహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు చేయూత

రాజన్నసిరిసిల్ల జిల్ల ప్రతినిధి: సామాజిక సేవా కార్యక్రమాలతో సమాజ సేవలో తన వంతు పాత్ర పోషిస్తున్న జనహిత ఫౌండేషన్ మరోమారు వృద్ధులకు చేయూతనందించింది. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమం, డేకేర్ సెంటర్లో జనహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు చలికాలం దృష్ట్యా స్వెటర్లు, స్టీల్ వాటర్ బాటిల్లు, ప్లేట్లు, గ్లాసులు అందించారు. ఈ సందర్భంగా వృద్ధులు, వృద్ధాశ్రమ నిర్వాహకులు జనహిత ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వ్యవస్థాపక కార్యనిర్వాహకులు సామల సాయితేజ, చైర్ పర్సన్ సామల రోజా, ప్రతినిధులు బద్దేపురి మహేందర్, రిక్కుమల్లె సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post