అంబర్ పేట్ అడ్డా నాదే: వీహెచ్ హనుమంతరావు

హైదరాబాద్:అక్టోబర్ 22
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల పంచాయితీ కొనసాగుతున్నది. తమకు ఈ ఎన్నికల్లో టికెట్‌ దక్కుతుందని ఆశించిన వారికి.. తొలి జాబితాలో పేరు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే హస్తం పార్టీకి పలువురు నేతలు రాజీనామా చేయగా.. మరికొందరు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హన్మంతరావు.. పార్టీకి మరో నేత ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.

అంబర్‌పేటలోని తన నివాసంలో ఆయన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు


ఈ సందర్భంగా వీహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తనను బయటకు వెళ్లొగొట్టేందుకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు.

నా నియోజకవర్గం అంబర్‌పేట వెంట పడుతున్నారన్న వీహెచ్‌.. ఆ సీటు తనదేనని.. ఇక్కడ వేలు పెడితే బాగోదన్న వీహెచ్‌.. అంబర్‌పేట వెంట పడితే.. తాను ఉత్తమ్‌ వెంట---అని హెచ్చరించారు.

అంబర్‌పేట నుంచి గెలిచి తాను మంత్రినయ్యానని గుర్తు చేసుకున్నారు. గతంలో తనపై కేసులు పెట్టిన నూతి శ్రీనివాస్‌గౌడ్‌ను తనపైకి ఉసిగొల్పుతున్నాడని ఆరోపించారు.

ఉత్తమ్‌తో పాటు ఆయన భార్యకు మాత్రం సీట్లు కావాలి.. తనకు మాత్రం వద్దా? అంటూ ప్రశ్నించారు. డబ్బులు తీసుకుని పోటీలో నుంచి వెనక్కి తగ్గుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

గతంలో తన మనుషులు ఏలేటి మహేశ్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డిని ఉత్తమ్‌ బయటకు పంపారని.. తాజాగా జగ్గారెడ్డిని పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

తాను గాంధీ కుటుంబానికి విధేయుడినని.. ఎప్పటికీ పార్టీ మారబోనన్నారు. ఇప్పటికే ఉత్తమ్‌ తనకు వ్యతిరేకంగా పని చేయడం ఆపాలని.. లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేసిన పనులన్నీ బయటపడుతానని హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post