హైదరాబాదులో సద్దుల బతుకమ్మ సంబరాలు


హైదరాబాద్, 22 అక్టోబర్(జన విజన్ న్యూస్):
తెలంగాణ పూల పండుగతో శోభాయమానంగా ఉంది. ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలే. పూలతో అలంకరించిన బతుకమ్మ సంబురాలతో నేడు రాష్ట్రం హోరేత్తుతోంది..

తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగ ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత. చివరి రోజు సద్దుల బతుకమ్మ.. ఈరోజు సందడి అంతా కనపడుతుంది. దుర్గాష్టమి వరకు తీరొక్క పూలతో బతుకమ్మ ఆడతారు.

బతుకమ్మ వేడుకల్లో ప్రతి రోజూ.. ప్రత్యేకమే. అయితే నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లుంబినీ పార్కు, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపును అమలు చేస్తున్నామని నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post