వేములవాడ, 22అక్టోబర్(జనవిజన్ న్యూస్): దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహా గౌరీ అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని ఆదివారం బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు దర్శించుకుని, అమ్మవారితో పాటు రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండి, ప్రజలందరూ పాడి పంటలతో, సుఖసంతోషాలతో విరాజిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, కొండ కనకయ్య, ఇప్పపూల అజయ్, సిరిగిరి చందు, జోగిని శంకర్, నాయకులు తీగల వెంకటేశ్వరరావు, ముద్రకోలా వెంకన్న తదితరులు ఉన్నారు.
Tags
vemulawada