రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న కరీంనగర్ జిల్ల జడ్జి శ్రీ వాణి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఆదివారం కరీంనగర్ జిల్ల జడ్జి శ్రీ వాణి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనంతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ ఇన్స్పెక్టర్ సంకపల్లి పవన్, పోసాని రాజులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post