బీజేపీలో చిచ్చు రాజేసిన మెదటి విడత అభ్యర్థుల లిస్ట్

తెలంగాణ: బీజేపీలో తొలి విడత అభ్యర్థుల జాబితా చిచ్చు రాజేసింది. దీంతో కొంతమంది నేతలు టిక్కెట్ ఆశించి.. రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ముథోల్ టికెట్ దక్కకపోవటంతో నిర్మల్ జిల్లా‌ బీజేపీ అధ్యక్ష పదవికి రమాదేవి రాజీనామా చేశారు. కన్న తల్లి లాంటి పార్టీ తనకు అన్యాయం చేసిందని బోరున విలపించారు. అలాగే పటాన్‌చెరు టికెట్‌ను నందీశ్వర్ గౌడ్‌కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న 8 మంది మండల, డివిజన్ బీజేపీ అధ్యక్షులు.. పటాన్‌చెరు అభ్యర్థిపై పునరాలోచన చేసుకోవాలని పార్టీ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు. 

బీజేపీ సీనియర్ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తన పేరు మెదట లిస్టులో లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలసి తన ఆవేదనను వ్యక్తపరిచారు. మరోవైపు బీజేపీకి కృషి చేసిన మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపారు.

Post a Comment

Previous Post Next Post