TS: రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రం వైపు శీతల గాలులు వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరుకున్నాయి. ఉదయాన్నే పొగమంచు కమ్మేస్తోంది. హన్మకొండలో సాధారణం కన్నా 2.7 డిగ్రీలు తగ్గి.. కనిష్ఠ ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్‌లో 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్, భద్రాచలం, ఆదిలాబాద్‌లోనూ సాధారణం కన్నా కొంచెం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Sports: వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో బంగ్లాదేశ్ - సౌతాఫ్రికా తలపడనున్నాయి.
TS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో 5.4 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ.3.09 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
TS: రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు జోస్యం చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, పార్టీ నేతలు ఐకమత్యంగా సాగి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మోత్కుపల్లి అన్నారు.
TS: సంగారెడ్డిలో నిర్వహించిన విజయదశమి ఉత్సవాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. వచ్చేపదేళ్లలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నా అన్నారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి.. ఎవరైనా కాదనగలరా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తన నోరు కట్టేశారని.. లేకపోతే మరిన్ని విషయాలను పంచుకునే వాడినని జగ్గారెడ్డి తెలిపారు.
TS : ఉత్పత్తి, నిర్వహణ అంశాల్లో పర్యావరణ హిత నిర్ణయాలకు సింగరేణి ప్రాధాన్యమిస్తోంది. ‘గ్రీన్ హైడ్రోజన్’ తయారీ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఘనత సాధిస్తే దేశంలోనే తొలి పరిశ్రమగా గుర్తింపు పొందనుంది. హైడ్రోజన్‌ను ప్రస్తుతం థర్మల్ విద్యుత్తు సాయంతో తయారు చేస్తున్నారు. ఇకపై థర్మల్‌కు బదులు సౌర విద్యుత్తు వినియోగించాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించింది.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరమవుతుంది. ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 322గా నమోదైందని సఫర్ తెలిపింది. అలాగే ఆనంద్ విహార్, హసన్‌పూర్ డిపో, ఇండియా గేట్, డ్యూటీ పత్, నెహ్రూ పార్క్, తీన్‌మూర్తి మార్గ్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనూ పొగమంచు కమ్మేసింది.
TS: ఢిల్లీలో ఈనెల 25న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై సీఈసీ సమావేశంలో చర్చించనున్నారు. 64 మంది అభ్యర్థుల ఎంపికపై కమిటీ తుది కసరత్తు చేయనుంది.
TS: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ బ్రిడ్జ్ క్రింద దెబ్బతిన్న పిల్లర్ ని నేడు కేంద్ర బృందం పరిశీలించనుంది.
TS: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో MBBS సీట్లు మిగిలిపోయినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 100 వరకు MBBS సీట్లు మిగిలినట్లు అంటున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,825 MBBS సీట్లు ఉండగా వాటిల్లో 15% అంటే 723 NRI కోటా సీట్లున్నాయి. స్ట్రే వేకెన్సీ పద్ధతిలో నింపేందుకు ఏర్పాట్లు చేసినా పెద్దగా స్పందన రాలేదని వర్సిటీ వర్గాలు అంటున్నాయి.
AP: తిరుమల జనవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు టీటీడి ప్రకటించింది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైటులో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
Sports: ఏషియన్ పారా గేమ్స్‌లో తెలంగాణ యువతి సత్తా చాటారు. మహిళల T20 400 మీటర్ల పరుగులో దీప్తి జివాంజీ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పతకంతో పారా గేమ్స్‌లో భారత స్వర్ణాల సంఖ్య 8కి చేరింది. మరోవైపు ఇప్పటివరకు భారత్ 22 పతకాలను ఖాతాలో వేసుకుంది.
AP: జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 కోటా) టికెట్లను టీటీడీ ఇప్పుడే అధికారిక వెబ్‌సైట్ లో విడుదల చేసింది.
Delhi: దేశంలోని పలు IAS కోచింగ్ సెంటర్లకు కేంద్రం నోటీసులు పంపింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయంగా టాపర్ల పేర్లను, ఫోటోలను వినియోగించి ఆశావాహులు ప్రభావితం చేస్తున్నారనే కారణంతో నోటీసులిచ్చింది.
KA: కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం బాలికలు పరీక్షలకు హిజాబ్‌తో హాజరు కావొచ్చని తెలిపింది. పోటీ పరీక్షలన్నింటికీ హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సుధాకర్ తెలిపారు.
Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గుండెపోటుకు గురైనట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి రష్యా రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెప్పుకునే జనరల్ SVR సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
Tags
Headlines