వేములవాడ, 20 అక్టోబర్ (జనవిజన్ న్యూస్): వేములవాడ పట్టణంలో శుక్రవారం జరుగుతున్న సద్దుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే గౌరీమాత ప్రతిష్టాపన కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి- రాజు, బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటు మున్సిపల్ పాలక వర్గ సబ్యులతో కలసి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చల్మెడ మాట్లాడుతూ.. గౌరీమాత అమ్మవారి ఆశీస్సులతో వేములవాడ పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. రాష్ట్రమంతా తొమ్మిది రోజుల్లో జరుపుకునే బతుకమ్మ పండుగను ఆడబిడ్డల ప్రేమ ఆప్యాయతలకు చిహ్నంగా వేములవాడ ప్రజలు మాత్రం ఏడు రోజుల్లోనే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుండటం గొప్ప విషయమని అన్నారు. ఆయన వెంట బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, నరాల శేఖర్, కొండ కనకయ్య, గూడూరి మధు, కందుల క్రాంతి, వెంగల శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు.
Tags
vemulawada