కానిస్టేబుల్‌ను డీ కొట్టి.. తొక్కుకుంటూ దూసుకెళ్లిన కారు

హైదరాబాద్ - రోడ్డుపై వాహన తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్ మీద నుంచి కారు దూసుకెళ్లిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 18న రాత్రి వాహన తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మహేష్.. అటుగా వస్తున్న కారును ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ఆపకుండా ఏకంగా కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

Post a Comment

Previous Post Next Post