తెలంగాణ పూల బతుకమ్మల సంబరాలలో నిన్నటికి ఏడో రోజున ఏడు రకల బతుకమ్మలు ముగిసాయి.
1. ఎంగిలిపువ్వుల బతుకమ్మ,
2. అటుకల బతుకమ్మ,
3. ముద్దపప్పు బతుకమ్మ,
4. నానబియ్యం బతుకమ్మ,
5. అట్ల బతుకమ్మ,
6. అలిగిన బతుకమ్మ,
7. వేపకాయల బతుకమ్మ వేడకలు ముగిశాయి.
8. వెన్నముద్దల బతుకమ్మ సంబురాలకు ఈరోజు ఎనిమిదో రోజు ఆడబిడ్డలు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. రకరకాల పూలు తెచ్చి ఎనిమిది అంతరాలుగా బతుకమ్మను పేర్చి ఆడి, పాడనున్నారు.
తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకుంటారు.
తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ సంబురాలు రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో ఉండే ఆడబిడ్డలు కూడా జరుపుకుంటారు. బతుకమ్మం అంటే తెలంగాణ ఆడబిడ్డలు ఆరోప్రాణంగా భావిస్తారు.
Tags
తెలంగాణ