భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాలు నిర్వహించాలి: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాలు నిర్వహించాలి: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

శాంతియుతంగా వేడుకలు చేపట్టాలి

భక్తులు అధికారులకు సహకరించాలి

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె తో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన విప్
---------------------------------
వేములవాడ, 17 సెప్టెంబర్ 2026: భక్తి శ్రద్ధలతో వేములవాడ పట్టణంలో ఈ నెల 23వ తేదీన వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలువు నిచ్చారు. 

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు వద్ద వినాయక నిమజ్జన వేడుకల కోసం మున్సిపల్, పోలీస్, రెవెన్యూ ఇతర శాఖల ఆద్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె తో కలిసి పరిశీలించారు. 

ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేములవాడ లో మొత్తం 311 గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు.  

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వినాయక నిమజ్జనానికి కావలసిన, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ అధికారులు సేవలు అందించాలని, పారిశుధ్య పనులు చేయించాలని, క్రేన్లు అందుబాటులో పెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో గుడి చెరువు బండ్ పార్క్ ను దాదాపు రూ. 12 కోట్లతో అద్భుతంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని, ఇటీవల మంత్రులు ప్రారంభించారని గుర్తు చేశారు. వేములవాడ పట్టణ వాసులతో పాటు భక్తులు, పిల్లలు తరలివస్తున్నారని తెలిపారు. నిమజ్జనం వేడుకలు భక్తులందరూ భక్తిశ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

పరిశీలనలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ జయంత్, మున్సిపల్ కమిషనర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post