జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవంలో
రెండవ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారిని రజనీదేవి కార్యాలయానికి పలు పనుల నిమిత్తము వఛ్చిన వాహన వినియోగదారులకు వాహనము నడుపునపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు.
సుమారు వందమంది డ్రైవర్లు వాహన వినియోగదారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వాహన కండిషన్, డ్రైవింగ్ లో మెలకువలు సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పలు సూచనలు చేశారు.
హెల్మెట్ ధరించండి: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఇది తల గాయాలను నివారిస్తుంది.
సీటు బెల్ట్‌లు ధరించండి: కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్‌లు ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో గాయాల తీవ్రతను తగ్గించవచ్చు.
అతివేగం నివారించండి: వేగ పరిమితులను పాటించడం ద్వారా ప్రమాదాల అవకాశాలను తగ్గించవచ్చు.
మద్యం సేవించి వాహనం నడపవద్దు: మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరం, చట్ట విరుద్ధం.
మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దు: డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం దృష్టి మరల్చి ప్రమాదాలకు దారితీస్తుంది.
ట్రాఫిక్ నియమాలను పాటించండి: ట్రాఫిక్ సిగ్నల్స్,ను గమనించగలరు. వాహనాన్ని నడుపే సమయములో వాహన అధిగమించే సమయములో ఓర్పు చాలా అవసరం అని తెలిపారు.
వాహన నిర్వహణ: వాహనాన్ని సమయానికి సర్వీస్ చేయించడం, బ్రేకులు, టైర్లు, లైట్లను సరిచూసుకోవడం అవసరం.
పాదచారులకు రోడ్డు దాటడానికి అవకాశం ఇవ్వడం, వారి భద్రతకు సహాయపడుతుంది.
వాహనం స్టార్ట్ చేసేముందు వాహనం క్రింద, వెనుకాల ఎవరైనా పిల్లలు జంతువులు ఉన్నాయో చూసుకొని వాహనాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా సూచించారు.
ఈ సూచనలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని, తమ ప్రాణాలను రక్షించుకోవచ్చు అని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వాహనాధికారి రజనిదేవితో పాటు సిబ్బంది కానిస్టేబుల్ రమ్య, సౌమ్య, ప్రశాంత్, హోమ్ గార్డ్ ఎల్లేష్ లు పాల్గొన్నారు.