స్వచ్ఛత పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
మిషన్ భగీరథ నీటి పరీక్షలు, సరఫరాపై దృష్టి సారించాలి
కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించాలి:
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
డిస్టిక్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ పై ఐడీఓసీలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష
రాజన్న సిరిసిల్ల, 17 సెప్టెంబర్ 2026
స్వచ్ఛత పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
డిస్టిక్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ పై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్ఛత హీ సేవ 2026 పోస్టర్లను ఆవిష్కరించారు.
నీటి నాణ్యత పర్యవేక్షణ కింద జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి ప్రతి నెలా 250 నమూనాలు రసాయన పరీక్షల కోసం 50 నమూనాలు బ్యాక్టీరియా పరీక్షల కోసం సేకరిస్తున్నామని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లలో లక్ష్యం మేరకు మరుగుదొడ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల రద్దీ అధికంగా ఉండే దేవాలయాలు, బస్టాండ్లు,మార్కెట్లు, కొత్తగా నిర్మించిన వీవో బిల్డింగ్స్, అంగన్వాడి బిల్డింగ్స్ వద్ద స్వచ్ఛభారత్ మిషన్ ఫండ్స్ ద్వారా కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించాలని సూచించారు. పురోగతిలో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మురుగునీటి నిర్వాణ కొరకు డ్రైనేజ్ ఎండింగ్ సోక్ పిట్లను స్వచ్ఛభారత్ మిషన్ ఫండ్స్ ద్వారా చేయించాలని సూచించారు.
వేములవాడ, సిరిసిల్ల డివిజన్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లకు స్థలాన్ని గుర్తించామని, పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని, బట్ట సంచులను వాడే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.
స్వచ్ఛత హీ సేవ 2026 లో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని, పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని పిలుపు నిచ్చారు.
గ్రామాలలో చెత్తపోగు బడే ప్రదేశాలను గుర్తించాలని, వాటిని శుభ్ర పరిచి రంగులు వేయించాలని ఆదేశించారు.
నీటి కుంటలు, చెరువులు, కాలువల్లో ప్లాస్టిక్ కవర్లను వేయకుండా గ్రామపంచాయతీ సెక్రటరీ, మున్సిపాలిటీల్లో సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ఎస్ బీ ఎం సురేశ్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.