థాయిలాండ్ ప్రధానమంత్రి సస్పెండ్
థాయిలాండ్ ప్రధాన మంత్రి పేటోంగ్టర్న్ షినవత్రాపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ కంబోడియా నాయకుడితో జరిగిన ఫోన్ కాల్ లీక్ అవడం, దానిపై దర్యాప్తు నేపథ్యంలో ఆమెను అధికారిక విధుల నుంచి రాజ్యాంగ న్యాయస్థానం సస్పెండ్ చేసింది.ఫోన్ కాల్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో పాటు ప్రజల నుంచి నిరసనకు దారితీసింది. థాయ్ సైనిక కమాండర్ను తన 'ప్రత్యర్థి' అంటూ ఆమె సంబోధించడం గమనార్హం..!!