సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి: పట్టణ అధ్యక్షులు సూర దేవరాజు

సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి: పట్టణ అధ్యక్షులు సూర దేవరాజు
సిరిసిల్ల, 13 సెప్టెంబర్ 2026: సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ కమిటీ, బూత్ లెవెల్ ఏజెంట్లు అందరు కలిసికట్టుగా పనిచేస్తూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు పట్టణ అధ్యక్షులు సూర దేవరాజు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వార్డ్ అధ్యక్షులు, పట్టణ కార్యవర్గం, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు మాట్లాడుతూ..  
రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నా, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ గెలవాలన్నా, పార్టీ బలోపేతం కావాలన్న బూత్ స్థాయి నుండే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు  మాక్అసెంబ్లీ పెట్టి చిల్లరగా మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రజలు ఛీ కొడుతున్న వారికి బుద్ధి రావట్లేదని, కేంద్రంలో దళిత నాయకుడు, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే మీటింగ్ పెట్టిన చోట బి జె పి, ఆర్ ఎస్ ఎస్ గుండాలు అక్కడ పసుపు నీళ్లతో శుద్ధి చేస్తే, తెలంగాణలో కాంగ్రెస్ దళిత నాయకులు కెసిఆర్ ఫామ్ హౌస్ దగ్గర నిరసన తెలియజేస్తే ఇక్కడేమో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు దళితులను అవమానపరుస్తున్నారని అన్నారు. దళితులను అవమానపరిచినందుకు బుద్ధి చెప్పాలని టిఆర్ఎస్ పార్టీతోో పాటు బిజెపికి బుద్ధి చెప్పాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు.


ప్రస్తుతం జరుగుతున్న SIR ఓటర్ల జాబితా సవరణ అనేది రాబోయే ఎన్నికల్లో భవిష్యత్తును నిర్ణయించే ఓట్లే కీలకమని అన్నారు. అక్టోబర్ 7, 2026 వరకే గడువు ఉందని, ఈ తక్కువ సమయంలో బూూత్ లెవెల్ ఏజెంట్లు అప్రరమత్తమై, నోటీసులు అందుకున్న ఓటర్ను ఆ ఫామ్ లో నింపి ఇచ్చారా లేదా అని తెలుసుకోవాలని సూచించారు. సిరిసిల్ల పట్టణంలో 39 వార్డుల్లో ప్రతి వార్డు అధ్యక్షుడు బాధ్యతగా తీసుకొని, ఆయా వార్డులో ఉన్న ప్రతి పోలింగ్ బూత్ పరిిధిిలో ఓటర్ల సమస్యయలను పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఆకునూరి బాలరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శులు నీలి రవీందర్, నేదురు లక్ష్మణ్, వెంగళ అశోక్, ఉపాధ్యక్షులు శ్రీరాముల వెంకటేశం, కార్యదర్శి బైరగోని రమేష్, కౌన్సిలర్లు కూరపాటి శ్రీశైలం, నాయకులు వెంగళ లక్ష్మీనరసయ్య, కంసాల మల్లేశం, మల్యాల నాగరాజ్, వార్డు అధ్యక్షులు ఆడపు ప్రసాద్, కొమ్ము త్యాగరాజు, పట్టణ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post