సిఐటియు కార్మిక సంఘం నాయకుల మానవతా సాయం

సిఐటియు కార్మిక సంఘం నాయకుల మానవతా సాయం

ప్రమాదానికి గురైన దూడం రాజు వార్పింగ్ కార్మికునికి వైద్య ఖర్చుల కోసం 25 వేల ఆర్థిక సాయం అందజేసిన సిఐటియు వార్పిన్ వర్కర్స్ యూనియన్  
సిరిసిల్ల, 13 సెప్టెంబర్ 2026: ద్విచక్ర వాహన ప్రమాదంలో ప్రమాదానికి గురైన కార్మికుడికి సిఐటియు కార్మిక సంఘం నాయకులు అండగా నిలిచారు. నెల రోజుల క్రితం సిరిసిల్ల పట్టణానికి చెందిన దూడం రాజు అనే వార్పిన్ కార్మికుడు బైక్ వెళ్తుండగా ప్రమాదానికి గురై మెడ నరాలు దెబ్బతిని, కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే హైదరాబాదులో చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు జరిగిందని, ఇంకా ఆరు మాసాల వరకు వైద్యం కొనసాగించాలని డాక్టర్లు చెప్పడం జరిగిందని అన్నారు. ఇప్పటికే అప్పులు చేసి వైద్యం చేయించారని ఇంకా ఆరు మాసాలు వైద్య ఖర్చులకు లేక రాజు కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఆపదలో ఉన్న తోటి కార్మికుడిని ఆదుకోవాలని వార్పిన్ కార్మికులందరూ కలిసి రూ. 25 వేలు జమచేసి వైద్య ఖర్చులకోసం అందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల సత్యం, కార్యదర్శి ముశం రమేష్. పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు మోర రవి, వార్పిన్ కమిటీ సభ్యులు ప్రవీణ్, గాజుల రాజు, సదానందం, శ్రీనివాస్, బల్ల రామచంద్రం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post