పోటీ పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
విజయానికి సరైన మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యం
పక్కా ప్రణాళికతో చదివి విజయం సాధించండి
రాజన్న సిరిసిల్ల 12 సెప్టెంబర్ 2026: జిల్లాలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌తో పాటు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సరైన మార్గదర్శకత్వం అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.
ఈసదస్సులో పోటీ పరీక్షలకు అవసరమైన సబ్జెక్టుల వారీగా పరీక్షల విధానం, సమయపాలన, ప్రిపరేషన్ ప్రణాళిక, పరీక్షల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఫిజికల్ టెస్ట్, గ్రౌండ్ ఈవెంట్స్‌కు సంబంధించిన అంశాలతో పాటుగా తదితర అంశాలపై నిపుణులచే ప్రత్యేక అభ్యర్థులకు అవగాహన కల్పించాడం జరిగింది.
ఈసందర్భంగా జిల్లా ఎస్పీ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ....
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ముందుగా ఏయే సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో గుర్తించి, ప్రణాళిక ప్రకారం ఆయా సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి సారించి సబ్జెక్టులపై పట్టు సాధించాలన్నారు.
చదువుతున్న సమయంలో ఏవైనా సందేహాలు ఉంటే వాటిని తమలోనే ఉంచుకోకుండా నిపుణులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు.ప్రతి సబ్జెక్టుకు నిర్దిష్ట వెయిటేజీ ఉంటుందని, దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆందోళన, భయాన్ని పక్కనపెట్టి ప్రశాంతంగా ప్రిపేరేషన్ కొనసాగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు.
అభ్యర్థులు ప్రతిరోజూ ఒక ప్రణాళికను రూపొందించుకుని, దాని ప్రకారం చదువును కొనసాగించాలని, సమయపాలన, క్రమశిక్షణ, నిరంతర సాధనతో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. చిన్న చిన్న వైఫల్యాలకు నిరుత్సాహపడకుండా, వాటిని పాఠాలుగా తీసుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగాలని అన్నారు.
Read more: వేములవాడ రాజన్న సన్నిధిలో సెప్టెంబర్ 14 నుంచి వినాయక నవరాత్రులు: ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ ఈవో
అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని , పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈకార్యక్రమలో డిఎస్పీ లు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సి.ఐ లు, ఎస్.ఐ లు, స్కిల్‌గురు డా. విజయరఘురామరాజు MBA (HR), PhD
ఆల్ ఇండియా పోలీస్ ట్రైనర్, CDT లైఫ్ కోచ్ & పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్ , మహేష్ కుమార్ MA (English), నవీన్ సుందర్ వెర్బల్ ట్రైనర్ , అమరేష్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ట్రైనర్, పోలీస్ సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.