ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షులుగా నిమ్మ బాల్‌రెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా బుర్క బాబ్జి
ఎల్లారెడ్డిపేట, 13 సెప్టెంబర్ 2026: ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా నిమ్మ బాల్‌రెడ్డి (సాక్షి), ఉపాధ్యక్షులుగా అనిల్ (వెలుగు), సయ్యద్ షరీఫ్ (సూర్య), ప్రధాన కార్యదర్శిగా బుర్క బాబ్జి (నమస్తే తెలంగాణ) ఎన్నికయ్యారు.
సంయుక్త కార్యదర్శులుగా కట్టెల బాబు (ప్రజా దర్బార్), గుర్రాల చంద్రమోహన్‌రెడ్డి (ఆంధ్రప్రభ), కందుకూరి రవి (ఎస్‌ఎస్ కేబుల్), కోశాధికారిగా మహమ్మద్ లతీఫ్ (జనంసాక్షి) ఎన్నికయ్యారు.


గౌరవ అధ్యక్షులుగా దుంపేటి గౌరీశంకర్ (ఆంధ్రజ్యోతి), మిట్టపల్లి లక్ష్మీనారాయణ (వార్త), గౌరవ సలహాదారులుగా ఎదురుగట్ల ముత్తయ్య (మన తెలంగాణ), కొండ్లెపు జగదీశ్వర్ (ప్రజాపక్షం) ఎంపికయ్యారు.
గౌరవ సభ్యులుగా ఇల్లందుల రాజిరెడ్డి (ఈనాడు), మసీద్ (నవ తెలంగాణ), పందిర్ల రవికాంత్ గౌడ్ (మెట్రో), బత్తిని శ్రీధర్ గౌడ్ (విజన్ ఆంధ్ర) తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, వాటి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.

Post a Comment

Previous Post Next Post