మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
సిరిసిల్ల 13 సెప్టెంబర్ 2026: ఈరోజు స్థానిక గాంధీ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తులా ఉమా గారు మాట్లాడుతూ.. ఎంతో గొప్పదైన ఆదర్శవంతమైన మన సాంప్రదాయాలను కాపాడుతూ అదే విధంగా పర్యావరణాన్ని కూడ కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి పవిత్రమైన వినాయక చవితి పర్వదినం సందర్భంగా మనం సాధ్యమైనంత వరకు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించుకుని పర్యావరణాన్ని సంరక్షించుకుందామని అన్నారు..
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులతో తయారైన వినాయక విగ్రహాలను ప్రతిష్టించడంతో ఆ విగ్రహాలు వినాయక నిమజ్జనం తర్వాత నీటిలో సరిగా కరగక పర్యావరణానికి హాని కలిగించే అవకాశం ఉందని అన్నారు.
మనం బాగుండాలని మన కుటుంబాలు బాగుండాలని మన చుట్టూ ఉన్న వారందరూ మన సమాజం బాగుండాలని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి పర్వదినం నాడు ఎంత పెద్ద విగ్రహాలు పెట్టామని కాకుండ పర్యావరణ పరిరక్షణ కోసం పోటీపడి మరి మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములమై మన భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణ వాతావరణం అందించాల్సిన బాధ్యత నేటితరాలపై ఉందని ఈ సందర్భంగా అన్నారు .
కాబట్టి ప్రజలందరూ ఈ వినాయక చవితి పర్వదినం నాడు మట్టితో సహజ రంగులతో తయారుచేసిన పర్యావరణ సహిత వినాయక విగ్రహాలను ప్రతిష్టించుకొని భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రజలందరిపై ఆ వినాయకుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
అనంతరం వినాయక చవితిని పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ లో వారు ప్రతిష్టించుకునేలా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్ బిఆర్ఎస్ పార్టీ తరఫున మట్టి వినాయక విగ్రహాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, పట్టణ కార్యదర్శి మ్యాన రవి, బోల్లి రామ్మోహన్ గారు, కౌన్సిలర్ సభ్యులు , కోఆప్షన్ సభ్యులు, మొదలగు BRS పార్టీ నాయకులుమరియు ప్రజలు పాల్గొన్నారు.
