సిరిసిల్లలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు
పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
అలరించిన విద్యార్థుల నృత్యాలు, పాటలు, మ్యాజిక్ షో కార్యక్రమం
---------------------------------
రాజన్నసిరిసిల్ల, 25 సెప్టెంబర్ 2026: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
సిరిసిల్ల మానేరు వాగు వద్ద శోభాయాత్ర, నిమజ్జన వేడుకలను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. నిమజ్జన స్థలం వద్ద అధికారులకు పలు సూచనలు చేశారు.
విద్యార్థుల నృత్యాలు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు, మ్యూజిక్ షో కార్యక్రమాలు భక్తులను అలరించాయి. పిల్లలు, పెద్దలు ఆసక్తిగా తిలకించారు.
కార్యక్రమంలో ఆర్డీవో శ్రీధర్ బాబు, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, కమిషనర్ ఖదీర్ పాషా, తహసీల్దార్ మహేష్, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.