మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంటలు సాగు చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంటలు సాగు చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

కూరగాయల సాగుతో నిరంతర ఆదాయం

పెద్ద బోనాలలో వరి వదిలి కూరగాయలు సాగు చేస్తున్న ఆదర్శ రైతును అభినందించిన జిల్లా కలెక్టర్

--------------------------
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ - 22
--------------------------

రైతులు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. 

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్ద బోనాలలో రైతు కాశెట్టి మల్లయ్య ఎల్ నినో ప్రభావంతో వరి సాగును వదిలి దాదాపు నాలుగు ఎకరాల్లో వంకాయ, మిరప, కాకరకాయ సాగు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కూరగాయల తోటను జిల్లా కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం వంకాయ దిగుబడి వస్తుండగా.. జిల్లా కలెక్టర్ పరిశీలించి ఆ రైతులు అభినందించారు. 

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రైతు సంప్రదాయంగా సాగు చేస్తున్న వరిని వదిలి వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వంకాయ దిగుబడి వస్తుందని వివరించారు. వంకాయ మొక్కలు నాటిన 45 రోజులు నుంచి దిగుబడి మొదలై దాదాపు ఆరు నెలల వరకు ప్రతి వారం పంట చేతికి వస్తుందని వెల్లడించారు. అన్ని ఖర్చులు పోను ఏడాదికి రెండు లక్షలకుపైగా ఆదాయం వస్తుందని రైతు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 


ఎల్ నినో ప్రభావంతో రైతులు ఉద్యానవన శాఖ అధికారుల సూచన మేరకు కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ ఇతర పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కూరగాయలు, ఆకుకూరలు సాగుతో రైతులకు నిరంతరం ఆదాయం వస్తుందని తెలిపారు.

పరిశీలనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post