సిరిసిల్లలో ఘనంగా నూలు పౌర్ణమి వేడుకలు.. హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్లలో ఘనంగా నూలు పౌర్ణమి వేడుకలు.. హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్, 28 ఆగస్టు 2026: నేతన్నలు ఆర్థికంగా ఎదగడానికి చీరల తయారీ ఆర్డర్లను ప్రభుత్వం అందిస్తుందని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలో నూలు పౌర్ణమి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ లుమాట్లాడుతూ రైతన్నల నేతన్నల జీవనోపాధి కోసం, జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గతంలో కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించే విధంగా చర్యలు చేపట్టి ఇక్కడి నేత కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుందన్నారు. అదేవిధంగా మళ్ళీ రెండోసారి కూడా నేత కార్మికులకు ప్రభుత్వం చీరల ఆర్డరు అందించి చేయూతను అందించే విధంగా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఖాది వస్త్రాలను వినియోగించాలని, వేద సన్మాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ శాలువాలను నిషేధించాలని కోరారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఖాదీ వస్త్రాలను వినియోగించాలని ప్రభుత్వం సూచించిందన్నారు. చేనేతకు సిరిసిల్ల ప్రసిద్ధి చెందిందని, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.


సిరిసిల్లలో ఘనంగా మార్కండేయ శోభాయాత్ర
నూలు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో మార్కండేయ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. శోభాయాత్రలో భక్తులు, పద్మశాలి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కండేయ స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన వీధుల మీదుగా శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. శోభాయాత్రతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.

మార్కండేయ శోభాయాత్రలో ఆకట్టుకున్న మగ్గం

 పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మార్కండేయ శోభాయాత్రలో ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఏర్పాటు చేసిన మగ్గం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్రాక్టర్‌పై మగ్గాన్ని ఏర్పాటు చేసి అందులో చీర నేస్తూ హరిప్రసాద్ శోభాయాత్రలో పాల్గొన్నారు.
చేనేత కళాకారుడి వినూత్న ప్రదర్శనను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.శోభాయాత్రను వీక్షించిన వారు మగ్గం వద్ద ఆగి హరిప్రసాద్ పనితీరును ఆసక్తిగా తిలకించారు.

సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పేలా ఈ ప్రదర్శన నిలిచింది.స్థానిక చేనేత సంప్రదాయాన్ని ప్రజలకు పరిచయం చేసేలా ఈ కార్యక్రమం సాగింది. మగ్గం ప్రదర్శన శోభాయాత్రలో సందడి నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, పద్మశాలి సంఘం యువజన అధ్యక్షులు సబ్బని హరీష్, పద్మశాలి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, ఆడెపు చంద్రకళ, గోలి వెంకటరమణ, బొల్లి రామ్మోహన్, గూడూరి ప్రవీణ్, స్థానిక కౌన్సిలర్లు, గుండ్ల పెళ్లి పూర్ణచందర్, యెల్లె లక్ష్మీనారాయణ, కూరపాటి శ్రీశైలం, దూడం రజనీ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ కాంగ్రెస్ నాయకులు సూర దేవరాజు, ఆకునూరి బాలరాజు, బొద్దుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: ఆడెపు లక్ష్మణ్ 
              సిరిసిల్ల 

Post a Comment

Previous Post Next Post