ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి:
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఐ డీ ఓ సీ ప్రజావాణికి 142 దరఖాస్తుల రాక
--------------------------------------
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు -24
-------------------------------------
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 142 దరఖాస్తులు రాగా, సంబంధిత శాఖల అధికారులకు అందజేసి.. త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని ఆదేశించారు.
సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 06 దరఖాస్తులు రాగా, ఆయా శాఖల అధికారులకు అందజేసి.. పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 05 దరఖాస్తులు రాగా, ఆయా శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు.
మండలాల్లో స్వీకరణ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంట వరకు ప్రజావాణి ఎంపీడీఓలు నిర్వహించి.. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
మండలాల వారీగా దరఖాస్తులు వివరాలు..
బోయినపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి 09, చందుర్తి మండలం 0, ఇల్లంతకుంట మండలం 10, గంభీరావుపేట మండలం 10, కోనరావుపేట మండలం 02, ముస్తాబాద్ 11, రుద్రంగి మండలం 02, తంగళ్లపల్లి మండలం 10, వీర్నపల్లి మండలం 07, వేములవాడ అర్బన్ మండలం 05, వేములవాడ రూరల్ మండలం 12, ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ కార్యాలయానికి 03 చొప్పున వచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగు తుందని, స్థానిక ప్రజలు తమ అర్జీలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అన్ని చోట్ల అప్లికేషన్లు ఆన్లైన్ చేస్తారని పేర్కొన్నారు.
ఐడీఓసీ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.