ఎస్ఐఆర్ రెండవ విడత ప్రక్రియలో అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా చూడాలి
తంగళ్ళపల్లి గ్రామ సభకు హాజరైన డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్
రాజన్నసిరిసిల్ల: ఎస్ఐఆర్ రెండో విడత ఓటర్ సవరణ ప్రక్రియ లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గ్రామ పంచాయతీ గ్రామసభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ..
ఎస్ఐఆర్ రెండవ విడత ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్లు బాధ్యతగా తమ ఓటు హక్కు ను రూడీ పరుస్తూ బూత్ లెవెల్ ఆఫీసర్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేయాల్సిన బాధ్యతను ఓటర్లకు బి ఎల్ ఏ లు గుర్తు చేయాలని చెప్పారు.
గైర్హాజరుకు సంబంధించిన ఓటర్ల నమోదు, చిరునామా మారిన ఓటర్ల సమస్యకు పరిష్కారం, ఒకటికి మించిన ఓట్లు నమోదైన వారి సమస్యకు పరిష్కారం, దాంతోపాటు మరణించిన వారి ఓటర్ల సవరణకు సంబంధించిన వివరాలను సమగ్రంగా బిఎల్ఓ లకు బిఎల్ఏలు అందించాలన్నారు.
అర్హులైన ఏ ఒక్క ఓటర్ తమ ఓటు హక్కును కోల్పోకుండా కాపాడాల్సిన బాధ్యత బి ఎల్ ఏ లు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.