ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల బ్లాక్ అధ్యక్షుడు సూర దేవరాజు
రాజన్న సిరిసిల్ల జిల్లా 26 ఏప్రిల్ 2026: సిరిసిల్ల పట్టణ పరిధిలోని 12వ వార్డు చంద్రంపేటలో లబ్దిదార్లకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల బ్లాక్ అధ్యక్షులు సూర దేవరాజు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర దేవరాజు మాట్లాడుతూ.. పేదలు ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం చేసే ఉద్దేశంతో ఇల్లు లేని ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఇల్లు లేని ప్రతి పేదవాడికి రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ బిల్లు ఉచితం, పేదలకు సన్న బియ్యం పంపిణీ, ఇలా సంక్షేమ పథకాల అమలులో అగ్ర బాగానే ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు నూనె శ్రీనివాసులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుడిశెట్టి బాలరాజు, కత్తెరపాక ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు నర్మెట సురేష్, నర్మెట పెద్ద శంకర్, తడగొండ స్వామి తదితరులు పాల్గొన్నారు.