నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రతినిధి: సిరిసిల్ల పట్టణ పరిధిలోని చంద్రంపేట 12వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల బ్లాక్ అద్యక్షులు సూర దేవరాజు నిర్మల ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇరు కుటుంబాల దంపతులకు నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా సూర దేవరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలులో దేశంలో ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రూ.500 లకే వంటగ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు మహాలక్ష్మి పథకంతో ఉచితంగా ఆర్టిసి బస్సులో ప్రయాణం, మహిళా సంఘాలకు పావలా వడ్డీకి రుణాలు, రైతులకు ఋణ మాఫీ, పండించిన పంటలకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ తదితర పథకాలతో దేశంలోని అగ్రగామిగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని అన్నారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు నూనె త్రివేణి, గుడిసెట్టి బాలరాజు, కత్తెరపాక ఎల్లయ్య, వార్డు అధ్యక్షులు నూనె శ్రీనివాస్, సద్దుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.