ఓటు వేయడం కోసం ఈ గుర్తింపు కార్డులను వాడండి: ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు

రేపు (బుధవారం) ఉదయం 07.00 గంటల నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు పోలింగ్

అన్ని ఏర్పాట్లు పూర్తి


వేములవాడ, సిరిసిల్ల పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్, జిల్లా మున్సిపల్ సాధారణ ఎన్నికల పరిశీలకులు

-----------------------------------
వేములవాడ/సిరిసిల్ల, ఫిబ్రవరి -10
-----------------------------------

మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పిలుపు ఇచ్చారు. ఈ నెల 11వ తేదీన బుధవారం సిరిసిల్ల, వేములవాడలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్బంగా వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిరిసిల్ల గీతానగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి తీసుకున్న అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ఎస్ఈసీ నిబంధనలకు మేరకు
విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్స్ లు చెక్ చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో 100 మీటర్ల వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దివ్యాంగులకు ర్యాంపు, వీల్ చైర్ సౌకర్యం కల్పించామని తెలిపారు.

సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓటర్లు అందరూ పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లు, బ్యాలెట్ పేపర్ అకౌంట్, పీఓ డైరీ రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించాలని వివరించారు. ఈ నెల 13 వ తేదీన సిరిసిల్ల, వేములవాడ సినారే కళామందిర్ లో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. 

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39 వార్డులు, వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులు ఉన్నాయని, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 117, వేములవాడ మున్సిపల్ పరిధిలో 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39,942 మంది పురుషులు, 42,011 మంది మహిళా ఓటర్లు, 06 ఇతర ఓటర్లు ఉన్నారని, మొత్తం ఓటర్లు 81,959 మంది ఉన్నారని వెల్లడించారు. అలాగే వేములవాడ మున్సిపల్ పరిధిలో 19,580 మంది పురుషులు, 21,279 మంది మహిళా ఓటర్లు, 18 ఇతర ఓటర్లు,  మొత్తం ఓటర్లు 40,877 మంది ఉన్నారని తెలిపారు.

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రిజర్వ్ స్టాఫ్ తో కలిపి రిటర్నింగ్ అధికారులు 15, వేములవాడ మున్సిపల్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు 12 కలిపి మొత్తం 27 మందికాగా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 15, వేములవాడ మున్సిపల్ పరిధిలో 12 కలిపి మొత్తం 27 మందిని నియమించామని తెలిపారు.

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్రిసైడింగ్ అధికారులు 140, వేములవాడ మున్సిపల్ పరిధిలో ప్రిసైడింగ్ అధికారులను 70 మందిని, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో కలిపి ఏపీఓలు మొత్తం 210 మంది, రెండు మున్సిపాలిటీల్లో ఓపీఓలు మొత్తం 630 మందిని నియామకం చేశామని వెల్లడించారు.

*ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా..*

ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుండి .. ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కాకుండా ఈ కింద చూపిన  ప్రత్యామ్నాయ ఫొటో ఐడీలలో దేనినైనా ఒకటి పోలింగ్ సిబ్బందికి చూపి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వెల్లడించారు. ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు, తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్, కేంద్ర కార్మికశాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్ఏఐ) కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా(RGI) జారీ చేసిన స్మార్ట్ కార్డు, భారతీయ పాస్ పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్ యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజేబుల్ గుర్తింపు కార్డు (యూడీఐడీ)లు కలిగి ఉండాలని వివరించారు.

పరిశీలనలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్, అధికారులు జగన్ మోహన్ రెడ్డి, శ్రీనివాసాచారి, భారతి, అన్సార్, మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post