మొబైల్ ఫోన్ పోయిన, చోరికి గురైనా www.ceir.gov.in (CEIR ) అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న,చోరికి గురైన 100 మొబైల్ ఫోన్లను (సుమారు10 లక్షల రూపాయల విలువగల) బాధితులకు అందజేత
జిల్లాలో ఇప్పటి వరకు 1887 ఫోన్లను గుర్తించి 1587 ఫోన్లను బాధితులకి అందజేయడం జరిగింది
జిల్లాల్లో మొబైల్ ఫోన్ల రికవరీ శాతం 84.1%.
జిల్లా ఎస్పీ మహేష్ బి గితే వెల్లడి
రాజన్న సిరిసిల్ల జిల్ల: జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి పోయిన, చోరీకి గురైన సుమారు 10లక్షల రూపాయల విలువ గల 100 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకి అందజేయడం జరిగిందని తెలిపారు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని, మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్ వంటివి మొబైలో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు.
సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై DOT (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్) CEIR పోర్టల్ ను 17-మే-2023 లో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని,ఈపోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు బ్లాక్ చేసి, సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.
జిల్లాలో ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్ లను మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని అన్నారు. ఎవరైన దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లైతే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1887 ఫోన్లు గుర్తించి 1587 ఫోన్లును సబంధిత మొబైల్ ఫోన్ల యజమనులకి అందించడం జరిగిందని, జిల్లాలో ఫోన్ల 84.1% తో రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు.
సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ 84.1% రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
పోయిన మొబైల్ ఫోను మళ్లీ దొరకదనుకున్న మొబైల్ ఫోన్ జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు జిల్లా ఎస్పీకి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళి కృష్ణ, ఐ టి కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్, ఆర్.ఐ లు రమేష్, యాదగిరి, ఎస్.ఐ శ్రీకాంత్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.