వన మహోత్సవంలో మొక్కల పంపిణీ
సిరిసిల్ల 19 జూలై 2025: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల అర్బన్ పరిధి పెద్దూర్ 8వ వార్డులో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శనివారం పెద్దూర్ వార్డు కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు హాజరై వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలను తీసుకెళ్లారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు తో పాటు పెద్దూర్ మాజీ సర్పంచ్ రాకం రమేష్, వార్డు ఇన్చార్జి రెడ్డిమల్ల సుమన్, సల్లూరి శంకర్, కాసారం ఎల్లయ్య, బెజ్జారం శేఖర్, సిరికోటి తిరుపతి, తిమ్మనగరం శ్రీనివాస్, వార్డు మహిళలు పాల్గొన్నారు.