రాజన్న సిరిసిల్ల జిల్ల:
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు అపెరల్ పార్క్ లో పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్( టెక్స్ పోర్ట్) యూనిట్ లను ప్రారంభించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
అపేరల్ పార్క్ లో తదితర వస్త్ర ఉత్పత్తులు పరిశీలించిన మంత్రులు
అనంతరం స్టిచింగ్ చేస్తున్న మహిళలతో మాట్లాడారు..
పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్( టెక్స్ పోర్ట్) లో పని చేస్తున్న మహిళలకు ఉపాధి, ఆర్థిక అంశాల పై వారితో మాట్లాడినా మంత్రులు
*మంత్రి పొన్నం ప్రభాకర్*
సిరిసిల్ల టెక్స్ టైల్ రంగం అభివృద్ధి నేను పార్లిమెంట్ సభ్యుడిగా శ్రీధర్ బాబు మంత్రి గా కావూరి సాంబశివరావు హయాంలో తీసుకురావడం నుండి అనేక రకాలుగా అభివృద్ధి చేశాం..
వర్క్ టూ ఓనర్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి చేశాం..
ముఖ్యమంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు ,నేను చేనేత రంగానికి సంబంధించి అనేక ఉపాధి కార్యక్రమాలు చేపట్టాం..
జీవో నెంబర్ 1 ద్వారా
ప్రభుత్వానికి ఉపయోగపడే వస్త్రం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం..
స్కూల్ పిల్లలకు మహిళా సంఘాలకు ఉపయోగపడే చీరలు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది
విద్యుత్ ఇబ్బందులు లేకుండా చేశాం.
చేనేత రంగానికి ఆనాడు ఇబ్బందులు ఉంటే మహిళా సంఘాలకు 5 లక్షల చొప్పున ఇచ్చి 12 వేలకు పైగా సిరిసిల్ల ప్రాంతానికి అంత్యోదయ కార్డులు ఇచ్చాం.
ఆత్మహత్యలు వద్దు అని దైర్యం చెప్పడానికి ర్యాలీలు చేశాం.
సన్న బియ్యం పంపిణీ ప్రారంభించాం..
దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి... మీరు పాలించే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్కదగ్గరైన సన్న బియ్యం ఇస్తున్నారా బండి సంజయ్ చెప్పాలి.. ఫ్లెక్సీ లో మా నరేంద్ర మోడీ ఫోటో లేదని అడుగుతున్నారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి వస్త్ర పరిశ్రమ మీద పన్నులు లేవు మీరు జీఎస్టీ వేసారు ముందు దానిని తొలగించు..
ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి
ఈ ప్రాంత అభివృద్ధి కి అండగా ఉంటాం..
వర్క్ టూ ఓనర్ కార్యాచరణ త్వరలోనే తీసుకుంటాం..
జ్యోతిరావు ఫూలే జయంతి మన అందరికీ స్ఫూర్తిదాయకం