సిరిసిల్ల పద్మశాలి సంఘం కార్యవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల
సిరిసిల్ల 13 జూలై 2025: సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం కార్యవర్గం గడువు ముగిసిన కారణంగా నూతన పాలకవర్గ ఎన్నికలు జరపడానికి ఎన్నికల అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. తేది 13-07-2025 ఆదివారం రోజున ఎన్నికల షెడ్యూల్ విడుదల.
19-07-2025, 20-07-2025 నామినేషన్ల స్వీకరణ మరియు పరిశీలన
సమయం: ఉదయం 10-00 గం॥ల నుండి సాయంత్రం 4-00 గం॥ల వరకు
21-07-2025 సోమవారం రోజున నామినేషన్ ఉపసంహరణ. సమయం: ఉదయం 10-00 గం॥ల నుండి సాయంత్రం 4-00 గం॥ల వరకు
తేది : 22-07-2025 మంగళవారం రోజున పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు.
సమయం: ఉదయం 10-00 గం॥లకు
తేది : 27-07-2025 ఆదివారం రోజున ఎన్నికల నిర్వహణ
సమయం: ఉదయం 9-00 గం॥ల నుండి మధ్యాహ్నం 2-00 గం॥ల వరకు.
సాయంత్రం : 4-00 గం॥లకు ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన.
అధ్యక్షుడిగా నామినేషన్ వేయడానికి రుసుము రూ.50,000
ప్రధాన కార్యదర్శి గా నామినేషన్ వేయడానికి రూ. 40,000
ఇద్దరు ఉపాధ్యక్షులు గా పోటీ చేసేందుకు ఒక్కొక్కరికి రూ. 30,000
కోశాధికారిగా పోటీ చేసేందుకు నామినేషన్ రుసుము రూ. 25,000
సహాయ కార్యదర్శి గా నామినేషన్ వేయడానికి రుసుము 25.000
39 మంది డైరెక్టర్లుగా(వార్డుకు ఒక్కరు చొప్పున) పోటీ చేసేందుకు ఒక్కొక్కరికి నామినేషన్ రుసుము రూ. 15,000/-