సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులకు సన్మానం
సిరిసిల్ల 23 జూలై 2025: పాత్రికేయ వృత్తిలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జర్నలిస్టులకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమం నిర్వహించారు. బుధవారం సిరిసిల్ల బైపాస్ సమీపాన గల ఎల్లమ్మ దేవాలయ ఫంక్షన్ హాల్లో 25 సంవత్సరాలు పాత్రికేయ వృత్తిని పూర్తి చేసుకున్న 20 మంది ప్రెస్ క్లబ్ సభ్యులను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్ ఆధ్వర్యంలో పాలకవర్గం శాలువాలతో సత్కరించి మేమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం మాట్లాడుతూ.. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జర్నలిస్టులు సమాజ హితం కోసం పనిచేస్తారని అన్నారు. సీనియర్ జర్నలిస్టులను గుర్తించి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించడం అభినందనీయమన్నారు.
సన్మాన గ్రహీతలు:
కరుణాల భద్రాచలం
తడుక విశ్వనాథం
మచ్చ ఆనందం
కొక్కుల భాస్కర్
కాంభోజ ముత్యం
ఊరడి మల్లికార్జున్
రాపల్లి సంతోష్
టివి నారాయణ
రాచ లక్ష్మణ్
మిట్టపల్లి కాశీనాథ్
ఇరుకుల ప్రవీణ్
పాలమాకుల శేఖర్
ఆకుల జయంత్
చిటికెన జగదీష్
చింతకింది శ్యామ్
సిద్దుల మురళి
గెంట్యాల భూమేష్
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు చల్ల ప్రసాద్ రెడ్డి, బైరి మధుసూదన్, ప్రయాకరావు వేణు, నగేష్, చిలుక సత్యనారాయణ, ఆడెపు మహేందర్, చౌటపల్లి వెంకటేష్, రాజేశం, జాన దయానంద్, మేడి కిషన్, గంప హరికృష్ణ, పరకాల ప్రవీణ్, రాపల్లి భాస్కర్, వంకాయల శ్రీకాంత్, గొట్టే కిరణ్, నీరటి నవీన్, గంగు సతీష్, ఏదుల తిరుపతి, మేఘనాథ్ రెడ్డి, సామల రాజేంద్రప్రసాద్, బొడ్డు పరశురాములు, బైరి విట్టల్, సిరిపురం శ్రీకాంత్, ఎండి పాషా, సల్మాన్, కలీం, గుండెల్లి గోపి, దారం కృష్ణ, ముండ్రాయి శ్రీనివాస్, వోడ్నాల వేణు, బుస రామనాథం, గోవిందు వేణు, సుకుమార్, జంగిలి రాజు, మునీందర్ రెడ్డి, అన్సర్ అలీ, వసీం, రియాజ్ పటేల్, రాజా రమేష్, అస్గర్ హుస్సేన్, అస్లాం తదితరులు పాల్గొన్నారు.