మృగశిర కార్తె సందర్భంగా నేడు చేప మందు పంపిణీ

హైదరాబాద్, జూన్ 08: మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు చేప మందు పంపిణీ కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. 

మందుకోసం ఇతర రాష్ట్రా లు, జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తు న్నారు. వారికోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రెండ్రోజుల ముందే చేప మందుకోసం చాలా మంది నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంకు చేరుకుని షెడ్లలో బస చేశారు.

ఉదయం 9:30గంటలకు ప్రారంభమయ్యే చేప మం దు పంపిణీ కార్యక్రమం.. 24గంటలపాటు సాగనుంది. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 1,60,000 చేప పిల్లలను సిద్ధం చేశారు. 

చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభిస్తారు. చేప మందు పొందేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

34 కౌంటర్లతో క్యూలైన్లలో ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు. టోకెన్ తీసుకున్న వారికే చేప మందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. చేప మందు పంపిణీ ప్రాంతంలో 1200 మంది పోలీసులతో బందో బస్త ఏర్పాటు చేశారు. 

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు వచ్చేవారికోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. చేప మందు ప్రసాదం పొందేందుకు శుక్రవారం ఉదయం నుంచే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు ఉబ్బసం వ్యాధిగ్రస్తులు చేరుకున్నారు.

Post a Comment

Previous Post Next Post